ఎలక్ట్రిక్ కార్లకు మొగ్గు చూపుతున్న మగువలు
- టాటా టియాగోకు మహిళల నుంచి ఆదరణ
- కొనుగోలు చేస్తున్న కస్టమర్లలో 24 శాతం వారే
- కార్ల పరిశ్రమలో సగటు మహిళా కస్టమర్లు 12 శాతమే
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు విక్రయించిన యూనిట్లలో మహిళలు సొంతం చేసుకున్నవి అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సుమారు 24 శాతం కొనుగోలుదారులు మహిళలుగా ఉన్నారు. కానీ, కార్ల పరిశ్రమలో సగటు మహిళా కస్టమర్లు 12 శాతంగానే ఉండడం గమనించొచ్చు. అంటే సంప్రదాయ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపించే మహిళలు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టియాగో ఈవీ కస్టమర్లలో 56 శాతం మంది వయసు 40 ఏళ్లలోపే ఉండడం గమనించొచ్చు.