అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్, స్నేహ
- అల్లు అరవింద్ దంపతులు సైతం సందర్శన
- ప్రముఖుల నుంచి రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు
- త్వరలో షూటింగ్ లకు హాజరు కానున్న రామ్ చరణ్
మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడపిల్లను ప్రసవించింది. ఉపాసన డెలివరీ నేపథ్యంలో రామ్ చరణ్ మూడు నెలల నుంచి సినిమా షూటింగ్ లకు విరామం తీసుకున్నాడు. ఇప్పుడు ఉపాసన డెలివరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ తిరిగి త్వరలోనే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి అపోలో ఆసుపత్రికి వచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి చేరాయి. (ఇన్ స్టా వీడియో కోసం)