Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పై అంతస్తు నుండి దూకేశారు

  • కోర్బా జిల్లా ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలో ఘటన
  • మొదటి అంతస్తు నుండి కిందకు దూకిన ప్రజలు
  • భారీ ఆస్తి నష్టం... ఎవరికీ హాని జరగలేదని వెల్లడి
People jump from upper floors as fire engulfs Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ లోని కోర్భా జిల్లాలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలో ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. అంతలోనే భవనమంతా మంటలు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న వారు బయటకు పరుగు తీశారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకునేందుకు కొంతమంది మొదటి అంతస్తు నుండి కిందకు దూకారు. ఎగసిపడుతున్న మంటలను దాటి, మొదటి అంతస్తు నుండి కిందకు దూకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో బట్టల దుకాణం, ఇండియన్ బ్యాంకుతో పాటు పలు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. ఈ మంటలు బ్యాంకులో మొదలయ్యాయి. క్షణాల్లో ఇతర దుకాణాలకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News