Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్లాక్ డ్రెస్సులో మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ ఫొటో షూట్

Tamannaah Bhatia new photo shoot in black dress
Advertisement
  • టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మెప్పిస్తున్న తమన్నా
  • విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించిన నటి
  • లస్ట్ స్టోరీస్2 సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న మిల్కీ బ్యూటీ
Advertisement
తన అందం, నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. అక్కడ వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఫేమస్ అయిన లస్ట్ స్టోరీస్ రెండో సిరీస్‌ లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ సిరీస్ చిత్రీకరణ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఈ మధ్యే తమన్నా ఓపెన్ గా చెప్పింది. ఇక, ఇన్నాళ్లూ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూ వస్తున్న మిల్కీ బ్యూటీ మారుతున్న కాలం దృష్ట్యా వాటికీ ఒకే చెప్పేసినట్టు ప్రకటించింది. 
.దాంతో, అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ మీడియాలో తమన్నా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఓవైపు సినిమాలు, సిరీస్‌ లతో బిజీగా ఉండే మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన విశేషాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఓ ఫొటోషూట్  ఫొటోలను సైతం షేర్ చేసింది. ఇందులో తమన్నా బ్లాక్ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. వాటిని తన ట్విట్టర్, ఇన్ స్టా లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ మరింత హాట్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
.
Advertisement
Advertisement
Tamannaah Bhatia
Bollywood
Tollywood
photo shoot

More Telugu News