బబితా ఫోగాట్ రెజ్లర్ల ధర్నాను నీరుగార్చేందుకు ప్రయత్నించింది: సాక్షి మాలిక్
- జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన రెజ్లర్ల ధర్నాలు
- రెజ్లర్ల మధ్యే ఐక్యత లేని వైనం
- సహచర రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫోగాట్ పై సాక్షి మాలిక్ ఆరోపణలు
- బబితా స్వార్థపరురాలని వ్యాఖ్యలు
సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవర్ధ్ కడియన్ శనివారం కూడా ఇదే అంశంపై ఓ వీడియో పోస్టు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ధర్నా చేసేందుకు రెజ్లర్ తరఫున మొదట అనుమతి తీసుకుంది బబితా ఫోగాట్, మరో బీజేపీ నేత తీర్థ్ రాణా అని వెల్లడించారు. కానీ, ఆ తర్వాత వారిద్దరే జంతర్ మంతర్ లో ధర్నా చేయడాన్ని వ్యతిరేకించారని ఆరోపించారు. ఇక్కడ రాజకీయ కారణాలతో ధర్నాలు చేయడం కుదరదని సలహాలు ఇవ్వడం ప్రారంభించారని వివరించారు. ఈ మేరకు సాక్షి, సత్యవర్ధ్ లిఖిత పూర్వక ఆధారాలను కూడా వెల్లడి చేశారు.
బబితా, తీర్థ్ రాణా తమ స్వార్థం కోసం రెజ్లర్లను ఉపయోగించుకున్నారని, రెజ్లర్లు ఆందోళనకర పరిస్థితుల్లో ఉంటే వారిద్దరూ ప్రభుత్వ పక్షాన చేరారని సాక్షి మాలిక్ తాజా ట్వీట్ లో ఆరోపించింది.