విష్ణు ప్రియతో నాది గురు శిష్యుల బంధమే.. ఆమె నన్ను ప్రేమించడం లేదు: జేడీ చక్రవర్తి
- ఓ వెబ్ సిరీస్ లో నటించిన విష్ణుప్రియ, జేడీ
- జేడీని ప్రేమిస్తున్నా, వాళ్ల అమ్మ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న విష్ణుప్రియ
- తన చిత్రాల్లోని పాత్రలతో విష్ణుప్రియ ప్రేమలో పడిందన్న జేడీ
వెబ్ సిరీస్ కోసం విష్ణుప్రియతో దాదాపు 40 రోజులు కలిసి వర్క్ చేశానని జేడీ వెల్లడించాడు. ‘ఆ సమయంలో ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు ఆ దర్శకుడు చెప్పాడు. అలా, నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడింది తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది’ అని జేడీ స్పష్టం చేశాడు.