ఆదిపురుష్ రిలీజ్ తర్వాత.. ఓం రౌత్ తొలి ట్వీట్!
- థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలు షేర్ చేసిన ఓంరౌత్
- దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని వ్యాఖ్య
- విమర్శలు, ట్రోల్స్ పై మాత్రం స్పందించని దర్శకుడు
ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ తర్వాత తొలిసారి ట్విట్టర్ లో ఓం రౌత్ స్పందించారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ‘జై శ్రీరామ్’ అని రాసుకొచ్చారు. దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని ఫొటోపై రాశారు. అయితే ఆదిపురుష్ కథ, గ్రాఫిక్స్, రాముడి వస్త్రధారణపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై ఆయన స్పందించకపోవడం గమనార్హం.
మరోవైపు ఆదిపురుష్ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా రాబట్టినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ఇప్పుడు ‘ఆదిపురుష్’ మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న హీరోగా ప్రభాస్ నిలిచారు.