Amani: పవన్ కల్యాణ్ లక్ష్యం ఉన్నతమైనది... ఆయనను ప్రజలు ఆశీర్వదించాలి: నటి ఆమని

  • నిన్న అన్నవరం క్షేత్రానికి విచ్చేసిన పవన్ కల్యాణ్
  • అదే రోజున స్వామివారి దర్శనం చేసుకున్న నటి ఆమని
  • ప్రతిఫలం ఆశించకుండా పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్య 
  • పవన్ కు గర్వం లేదని కితాబు
Amani says people should bless Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న (జూన్ 14) వారాహి యాత్ర షురూ చేసిన సంగతి తెలిసిందే.  అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ తన యాత్రను ప్రారంభించారు. 

కాగా, అన్నవరం పరిసరాల్లో నారాయణ అండ్ కో చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నారాయణ అండ్ కో చిత్రబృందం కూడా నిన్ననే అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర అన్నవరం నుంచే ప్రారంభం కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ప్రజలకు, సమాజానికి మేలు చేయాలన్న పవన్ కల్యాణ్ లక్ష్యం ఉన్నతమైనదని, అలాంటి వ్యక్తిని ప్రజలు ఆశీర్వదించాలని ఆమని పిలుపునిచ్చారు. 

ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు పవన్ కు ఎలాంటి గర్వం లేదని, నిజంగా చాలా గొప్ప వ్యక్తి అని ఆమని కొనియాడారు. పవన్ కల్యాణ్ ను ఆయన లక్ష్యమే ముందుకు నడిపిస్తుందని అన్నారు.

More Telugu News