పెళ్లింట పెను విషాదం.. వడదెబ్బతో వరుడి దుర్మరణం

Man dies due sun stroke hours before his wedding in Telangana
  • కుమురం భీం జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • మంగళవారం వడదెబ్బ తగిలి వరుడికి అనారోగ్యం
  • బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో  పెళ్లికొడుకు మృతి
  • పెద్ద కుమారుడు దూరమవడంతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. మరికొన్ని గంటల్లో పెళ్లనగా వరుడు వడదెబ్బ బారిన పడి మృతి చెందడంతో పెళ్లింట పెను విషాదం అలముకుంది. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్-యశోద దంపతుల పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా  భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం పెళ్లి ముహూర్తం కాగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 

అయితే, పెళ్లిపనుల్లో బిజీగా ఉన్న తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో, కుటుంబసభ్యులు తొలుత అతడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి మృతి చెందాడు. మరికొన్ని గంటల్లో పెళ్లనగా తమ పెద్దకుమారుడు ఇలా అనూహ్యంగా మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Go Back to Shorts
Telangana

More Telugu News