జియో నుంచి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

Reliance Jio announces five new prepaid plans with JioSaavn subscription
  • ఐదు రకాల ప్లాన్లను ప్రకటించిన సంస్థ
  • రూ.269 నుంచి రూ.789 మధ్య వీటి రీచార్జ్ ధరలు
  • వ్యాలిడిటీ, డేటా ప్రయోజనాల్లో వ్యత్యాసం
రిలయన్స్ జియో కొత్తగా పలు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి రీచార్జ్ ధర రూ.269 నుంచి రూ.789 మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ లిమిటెడ్ డేటా, కాలింగ్ ప్రయోజనాలతో వస్తున్నాయి. 

రూ.269 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రోజువారీ 1.5 జీబీ ఉచిత హై స్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. 

ప్లాన్ రూ.529
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఇందులోనూ రోజువారీ 1.5జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాల్స్ వినియోగించుకోవచ్చు. జియో స్యూట్ యాప్స్, జియో సావన్ ను ఉచితంగా పొందొచ్చు.

ప్లాన్ రూ.589
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటాను ఉచితంగా పొందొచ్చు. పరిమితి లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందొచ్చు. జియో యాప్స్ యాక్సెస్ ఉచితంగా చేసుకోవచ్చు. 

ప్లాన్ రూ.739
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 1.5జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఫ్రీ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. జియో యాప్స్, జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా ఇలా జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ప్లాన్ రూ.789
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. కాల్స్ కూడా ఉచితమే. రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా ఉచితంగా పొందొచ్చు. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
Reliance Jio
new prepaid plans
JioSaavn
jio apps

More Telugu News