Vijay Devarakonda: పూజ హెగ్డే ప్లేస్ లో మృణాల్ ఠాకూర్!

Vijay Devarakonda movie update
షార్ట్స్‌లో చూడండి
వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా పూజ హెగ్డే క్రేజ్ గానీ ... అవకాశాలు గాని తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ జోడీగా కూడా ఆమెను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. 

'సీతారామం' సినిమాతో మృణాల్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఆ సినిమాలోని సీత పాత్ర అంతగా ఆమెకి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నాని సరసన నాయికగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. 

విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ ఒక సినిమా చేయనున్నాడు. రేపో మాపో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు పూజ హెగ్డేను అనుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియదుగానీ, ఆ ప్లేస్ లో మృణాల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మృణాల్ చేతికి మరో పెద్ద ప్రాజెక్టు చిక్కిందన్న మాట. 

Go Back to Shorts
Vijay Devarakonda
Parashuram
Mrunal Thakur

More Telugu News