ఉద్యోగుల సంతోషమే మాకు ముఖ్యం: జగన్
- సీఎం జగన్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు
- ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారన్న జగన్
- జీపీఎస్ కోసం రెండేళ్లు కసరత్తు చేశామని వెల్లడి
జీపీఎస్ కోసం రెండేళ్లపాటు కసరత్తు చేశామని, ఈ మోడల్ దేశానికే ఆదర్శమవుతుందని సీఎం అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు.