ఉద్యోగుల సంతోషమే మాకు ముఖ్యం: జగన్

  • సీఎం జగన్ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు
  • ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారన్న జగన్
  • జీపీఎస్ కోసం రెండేళ్లు కసరత్తు చేశామని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ఉద్యోగులు సంతోషంగా ఉండటమే తమకు ముఖ్యమని అన్నారు. ఉద్యోగులు ఆనందంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. ప్రతి ఉద్యోగిని సంతోషంగా ఉంచడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలని యత్నిస్తున్నామని చెప్పారు. 

జీపీఎస్ కోసం రెండేళ్లపాటు కసరత్తు చేశామని, ఈ మోడల్ దేశానికే ఆదర్శమవుతుందని సీఎం అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు.

Jagan
YSRCP
Employees Union Leaders

More Telugu News