ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్'కు పోటీగా ఒక్క సినిమానే!
- ఈ నెల 16న విడుదల కానున్న 'ఆదిపురుష్'
- ప్రభాస్ చిత్రానికి పోటీగా బరిలో లేని సినిమాలు
- 16న ఓటీటీలోకి వస్తున్న 'కనులు తెరిచినా కనులు మూసినా'
మరోవైపు, 'ఆదిపురుష్' విడుదల కావడానికి ఒక రోజు ముందు హాలీవుడ్ చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతోంది. ఈ చిత్రంలో మిల్లర్ కీలక పాత్రలో నటించగా, ఆండీ యూషియాటీ దర్శకర్తం వహించారు. ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. 15వ తేదీన ఇది తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా చూసేందుకు మన తెలుగు ప్రేక్షకులు ఎలాగూ పెద్దగా ఉత్సుకత చూపించరు. కాబట్టి 16 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్లర్లలో పూర్తిగా 'ఆదిపురుష్' సందడే ఉండబోతోంది.
ఇంకోవైపు, ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సైతాన్' వెబ్ సిరీస్ (తెలుగు) స్ట్రీమింగ్ కానుంది. జూన్ 16న ఈటీవీ విన్ లో 'కనులు తెరిచా కనులు మూసినా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.