Metformin: డయాబెటిస్ మాత్రతో లాంగ్ కొవిడ్‌కు ముకుతాడు

  • చాలామందిని ఇంకా వేధిస్తున్న లాంగ్ కొవిడ్
  • మెట్‌ఫార్మిన్ ట్యాబ్లెట్‌ను రెండు వారాలపాటు వేసుకోవడం వల్ల లాంగ్ కొవిడ్ నుంచి విముక్తి
  • ‘ద లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్’లో అధ్యయన వివరాలు
Study Shows Metformin Lowers Long COVID Risk

కొవిడ్ సమస్య దాదాపు ముగిసినా లాంగ్ కొవిడ్ (దీర్ఘకాల కొవిడ్) మాత్రం చాలామందిని ఇంకా వేధిస్తోంది. కొంతమందిలో ఇది కేన్సర్ కంటే ప్రమాదకరంగా మారుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు జరిగిన అధ్యయనంలో ఊరటనిచ్చే విషయం బయటపడింది. 

మధుమేహంతో బాధపడేవారు వేసుకునే మెట్‌‌ఫార్మిన్ ట్యాబ్లెట్‌ను రెండు వారాలపాటు తీసుకోవడం వల్ల దీర్ఘకాల కొవిడ్ ముప్పు 10 నెలల్లో 40 శాతం తగ్గుతుందని తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘ద లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. ఊబకాయం కారణంగా తీవ్ర కొవిడ్ ముప్పు పొంచి వున్న 30 ఏళ్లు పైబడిన వారిపై 10 నెలల పాటు జరిపిన అధ్యయనం అనంతరం ఈ విషయం వెల్లడైంది.

More Telugu News