దేశ జనాభాలో 11 శాతం మందికి మధుమేహం
- 35 శాతం మందికి బీపీ
- ఐసీఎంఆర్ నివేదిక వెల్లడి
- కొంత మెరుగ్గా తెలుగు రాష్ట్రాల పరిస్థితి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసాంక్రమిక వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి ఈ అధ్యయనం చేపట్టినట్లు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా 1,13,043 మంది నుంచి నమూనాలు సేకరించి, విశ్లేషించామని వివరించారు. ఈ నివేదిక ప్రకారం.. మధుమేహం, బీపీ బాధితుల విషయంలో తెలుగు రాష్ట్రాల పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే ఉందని చెప్పారు. మధుమేహ బాధితులు ఎక్కువగా గోవా, పుదుచ్చేరి, కేరళ, చండీగఢ్, ఢిల్లీలలో ఉన్నారని, ఈ జాబితాలో తెలంగాణ 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచాయని తెలిపారు. తెలంగాణలో 9.9 శాతం, ఏపీలో 9.5 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పారు.