సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ
- ఏపీలో జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం
- ఎండలు ఇంకా మండిపోతున్నాయన్న అనగాని
- వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఏసీ రూముల్లోంచి బయటికి రావడంలేదని వ్యాఖ్య
- పిల్లలు స్కూలుకు ఎలా హాజరవుతారన్న టీడీపీ ఎమ్మెల్యే
ఎండవేడిమి తట్టుకోలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఏసీ రూముల్లోంచి బయటికి రావడంలేదని అనగాని సత్యప్రసాద్అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు స్కూళ్లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి స్కూళ్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.