central govt: రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేలు అందించనున్న కేంద్రం

  • మిషన్ శక్తి పేరుతో కొత్త పథకం తీసుకొచ్చిన ప్రభుత్వం
  • ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకేనని వెల్లడి
  • 2022 ఏప్రిల్ నుంచే పథకం అమలు చేయనున్నట్లు వివరణ
central governament new scheme for women

ఆడపిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి రూపకల్పన చేసింది. మిషన్ శక్తి పేరుతో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా రెండో కాన్పులో ఆడపిల్ల ఫుట్టిన మహిళల ఖాతాల్లో రూ.6 వేలు జమచేయనుంది. ఆడపిల్లల జనాభా పెంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించడమే ఈ పథకం వెనకున్న లక్ష్యమని ప్రకటించింది. ఈ పథకాన్ని 2022 ఏప్రిల్ నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో కాన్పులో కవలలకు జన్మనిచ్చినా అందులో ఆడపిల్ల ఉంటే ఈ పథకం వర్తిస్తుందని వివరించింది.

తొలిసారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ పేరుతో పథకం ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ స్కీం కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినా మూడు దశల్లో రూ.5 వేలు అందజేస్తోంది. గర్భం దాల్చినట్లు ఆన్ లైన్ లో నమోదైన తర్వాత రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2 వేలు, ప్రసవం జరిగి ఇమ్యూనైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2 వేల చొప్పున అందజేస్తోంది. అయితే, ఈ స్కీం రెండో కాన్పునకు వర్తించదు. ఈ నేపథ్యంలోనే మిషన్ శక్తి పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది.

More Telugu News