వైసీపీ కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం సమావేశం.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు
- కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన వంగా గీత, జ్యోతుల చంటిబాబు
- అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు
- ఇటీవలే తుని రైలు దగ్ధం కేసులను ఎత్తివేసిన వైసీపీ ప్రభుత్వం
ముద్రగడ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కూడా లేరనే విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన కేసులతో ముద్రగడ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ఆ కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఈ క్రమంలో వైసీపీ కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.