చడీచప్పుడు లేకుండా డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చేసిన అవతార్-2
- గతేడాది డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన అవతార్ సీక్వెల్
- 173 రోజుల తర్వాత ఓటీటీ వేదికపై విడుదల
- జూన్ 7 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులు సంతోషపడేలా ఓటీటీ తెరపై నిన్న రిలీజ్ అయింది. జూన్ 7 నుంచి డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2022 డిసెంబరు 15న అవతార్-2 ప్రేక్షకుల ముందుకు రాగా, 173 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత ఓటీటీ వేదికపై రంగప్రవేశం చేసింది.
ఇటీవల అవతార్-2 యూట్యూబ్ లో రిలీజ్ అయినా, అది చెల్లింపు (Rent/Buy) ప్రాతిపదికన కావడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ లోకి రావడంతో వీక్షణల సంఖ్య భారీగా నమోదవుతోంది.