నాశనం కావాలంటూ ప్రజలపై వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు.. స్థానికుల ఆగ్రహం
- గుంటూరు 9వ డివిజన్లో కాలువల శంకుస్థాపనకు వెళ్లిన ముస్తఫా
- బాగున్న కాలువలను ఎందుకు పగలగొడతారన్న స్థానికులు
- ఎమ్మెల్యే, స్థానికుల మధ్య వాగ్వాదం
ఈ క్రమంలో స్థానికులకు, ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే స్థానికులపై శాపనార్థాలు పెట్టారు. నాశనం కావాలని అన్నారు. దీంతో, ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా తమ వద్దకు వచ్చావా అని మండిపడ్డారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.