Prime Minister: ప్రధాని చదివిన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అధ్యయన అవకాశం

PM Narendra Modi school in Gujarat to host students from across India
  • ప్రాజెక్టు ప్రేరణ కింద పాఠశాల అభివృద్ధి 
  • దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులకు చోటు
  • ప్రయోగాత్మక అధ్యయన విధానం
ప్రధాని నరేంద్ర మోదీ విద్యాభ్యాసం చేసిన గుజరాత్ లోని వాద్ నగర్ పాఠశాల దేశవ్యాప్త గుర్తింపునకు నోచుకోనుంది. 19వ శతాబ్దం నాటి ఈ పాఠశాలను అధికారులు ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. పాత నిర్మాణశైలిలోనే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ ప్రేరణ’ కింద ఈ పనులు చేపట్టారు. ప్రధాని సూచనల మేరకు మార్పునకు ప్రేరణగా ఈ పాఠశాలను నిర్వహించనున్నారు.

ఈ పాఠశాలలో స్వల్పకాల (వారం పాటు) అధ్యయనానికి దేశవ్యాప్తంగా విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. బ్యాచుల వారీగా స్టడీ టూర్ నిర్వహిస్తారు. ప్రతీ బ్యాచులో 30 మంది విద్యార్థులు ఉంటారు. అంటే 15 జిల్లాల నుంచి ఇద్దరికి చొప్పున అవకాశం లభిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా 750 జిల్లాల నుంచి మొత్తం 1,500 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యా విధానాన్ని తెలుసుకునే అవకాశం సొంతం చేసుకుంటారు. ఇక్కడ విశిష్ట విద్యా విధానాన్ని పాటించనున్నారు. అంటే బోధనలు ఏమీ ఉండవు. అంతా ప్రయోగాత్మక అధ్యయన విధానమే ఉంటుంది. భవిష్యత్తును మార్చే వారిగా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించనున్నారు. 

‘‘ఇది భవిష్యత్ పాఠశాలగా పరిగణింపబడుతుంది. విద్య, విలువలకు ప్రేరణగా నిలుస్తుంది. ఇక్కడే ఉండి చదువుకునే కార్యక్రమం ఇది. ఇందుకు అయ్యే వ్యయాలు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది’’ అని ఓ అధికారి తెలిపారు.
Prime Minister
Narendra Modi
school
vadnagar
gujarat
redevelopment

More Telugu News