Urvashi Rautela: పాటకు మూడు కోట్లు.. ఊర్వశీ రౌతేలా డిమాండ్ అలాంటిది మరి!

Urvashi Rautela charges Rs 3cr for song
  • వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ పాటతో టాలీవుడ్ లో గుర్తింపు
  • ఏజెంట్ సినిమాలో ప్రత్యేక పాట చేసిన రౌతేలా
  • పవన్–సాయితేజ్ చిత్రం నుంచి ఆఫర్
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ ఐటమ్ సాంగ్‌ తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. ఆ పాట బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే, అవన్నీ స్పెషల్ సాంగ్స్ కావడం విశేషం. అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌ చిత్రంలో స్పెషల్ సాంగ్‌ చేసిన ఊర్వశీ.. పోతినేని రామ్, బోయపాటి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలోనూ ఓ పాట చేసింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘బ్రో’ సినిమాలోనూ ప్రత్యేక పాట కోసం ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 

ఇలా వరుసగా ఆఫర్లు రావడంతో డిమాండ్ తగ్గట్టుగా తన రెమ్యునరేషన్‌ ను ఊర్వశీ అమాంతం పెంచిందని టాక్. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. పూజాహెగ్డే, రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రత్యేక పాట కోసం ఐదు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే కాస్త తక్కువే కావడంతో ఊర్వశీకి మూడు, నాలుగు నిమిషాల కోసం మూడు కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట. ఏదేమైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఊర్వశీ రౌతేలా పక్కాగా పాటిస్తోంది.
Urvashi Rautela
item songs
3cr
Tollywood
Bollywood

More Telugu News