KS Bharat: అశ్విన్ కు తెలుగు క్లాస్ తీసుకున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్

లండన్ లోని ఓవల్ మైదానంలో రేపటి నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆసీస్ జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త జెర్సీలు ధరించిన టీమిండియా ఆటగాళ్లు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎస్ భరత్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. 

ఒత్తిడికి గురవుతున్నావా అని భరత్ ను అశ్విన్ ప్రశ్నించగా... ఒత్తిడికి గురికావడం లేదు, మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను, మేం బాగా ఆడి కప్ ఇంటికి తెస్తాం అని భరత్ తెలిపాడు. 

అంతకుముందు భరత్ తమిళంలో మాట్లాడగా, అశ్విన్ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత భరత్ ను అడిగి తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
KS Bharat
Ravichandran Ashwin
Telugu
Team India
WTC Final

More Telugu News