AP Government: మరోసారి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి రూ.3 వేల కోట్లు!

another three thousand crores was borrowed by the ap government
  • వచ్చే 20 ఏళ్లపాటు వివిధ వడ్డీ శాతాలతో తిరిగి చెల్లించనున్న ఏపీ సర్కారు
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో 65 రోజుల్లోనే రూ.18,500 కోట్ల రుణాలు
  • రూ.3 వేల కోట్లు జమ అయితేనే ఉద్యోగులకు పూర్తి వేతనాలు, పెన్షన్లు!

ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా 3 వేల కోట్ల రుణాన్ని తెచ్చింది. ఈ మొత్తాన్ని వచ్చే 20 ఏళ్లపాటు వివిధ వడ్డీ శాతాలతో చెల్లించనుంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో కేవలం 65 రోజుల వ్యవధిలోనే 18,500 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకోవడం గమనార్హం.

తాజాగా తెచ్చిన రూ.3 వేల కోట్లలో.. రూ.వెయ్యి కోట్లను 14 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లను 20 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీ చెల్లించనుంది. ఇక రూ.500 కోట్లను 10 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో, మరో రూ. 500 కోట్లను 19 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో చెల్లించనుంది. 

మరోవైపు రాష్ట్రంలో నేటికీ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడని పరిస్థితి. ఈ 3 వేల కోట్ల రూపాయలు ఖజానాలో జమ అయితే పూర్తి స్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News