Junior NTR: సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించనున్న ఎన్టీఆర్?

Junior NTR to start his own production house
  • తొలి చిత్రాన్ని నానితో చేయబోతున్నట్టు సమాచారం
  • కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహించబోతున్నాడని సమాచారం
  • ప్రస్తుతం 'దేవర' చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఆసక్తికమైన ప్రచారం జోరుగా సాగుతోంది. తారక్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెపుతున్నారు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త ట్యాలెంట్ ను ఆయన ప్రోత్సహించబోతున్నట్టు సమాచారం. తొలి చిత్రాన్ని నానితో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు హీరోలకు సొంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని చేయబోతున్నాడు.
Junior NTR
Production House
Tollywood

More Telugu News