బీజేపీకి, వైసీపీకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.. చంద్రబాబు మహా నేర్పరి: సజ్జల
- చంద్రబాబు రకరకాల విన్యాసాలను ప్రదర్శిస్తుంటారన్న సజ్జల
- లోకేశ్ ను ముందుకు తీసుకొచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శ
- వైసీపీకి 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని వెల్లడి
ప్రజల్లో సీఎం జగన్ కు ఆదరణ లేదని చంద్రబాబు చెపుతున్నారని... అలాంటప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. వైసీపీకి 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని... అందరూ కట్టకట్టుకుని వచ్చినా జగన్ కు సీట్లు పెరుగుతాయని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయని... అవి కేంద్రం, రాష్ట్రం మధ్య ఉండే సంబంధాలేనని చెప్పారు. బీజేపీకి, వైసీపీకి మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎవరు ఉన్నా జగన్ ను గౌరవిస్తారని అన్నారు. బాబు అంచనా వేసిన స్థాయిలో నారా లోకేశ్ ఎదగలేకపోయారని... అందుకే లోకేశ్ ను ముందుకు తీసుకొచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.