రేపటి నుంచి తెలంగాణ నిప్పుల కొలిమే!

  • మంగళవారం నుంచి వారం పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు
  • 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
  • హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటాయని తెలిపింది. అయితే, సోమవారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.


More Telugu News