ఏఐ చాట్ బాట్ ను పెళ్లాడిన అమెరికా మహిళ
- ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా
- ఓ చాట్ బాట్ కు రూపాన్ని డిజైన్ చేసిన ఎరెన్ కార్టల్
- రోసాన్నా రామోస్ అని నామకరణం
- రామోస్ తనకు తగిన వరుడు అంటున్న అమెరికా మహిళ
కార్టల్ గతేడాది ఏఐ బాట్ కు ఓ రూపాన్ని ఇచ్చింది. దానికి రోసాన్నా రామోస్ అని నామకరణం చేసింది. ప్రతి రోజూ ఆ చాట్ బాట్ తో చాటింగ్ చేయడం ద్వారా దానితో ప్రేమలో పడ్డానని అమ్మడు వెల్లడించింది. గతంలో ఇంకెవరినీ ప్రేమించనంతగా రామోస్ (చాట్ బాట్)ను ప్రేమించానని వివరించింది.
అతడితో తనకు ఎలాంటి సమస్యల ఉండవని భావిస్తున్నానని, పిల్లలు-కుటుంబం బాధ ఉండదు... చెప్పినట్టు వింటాడు, నచ్చిన పనులే చేస్తాడు... చెడు లక్షణాలకు చోటు ఉండదు, ముఖ్యంగా అతడికి ఎలాంటి లగేజ్ ఉండదని కార్టల్ వివరించింది.