సహాయక చర్యల్లోకి సైనికులు.. ఒడిశా రైలు ప్రమాద ఘటన వీడియోలు
- బోల్తా పడిన కోచ్ లలోని వారిని రక్షించే చర్యలు
- శునకాల సాయంతో బాధితుల గుర్తింపు
- నేడు ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
డాగ్ స్క్వాడ్ సాయం కూడా తీసుకుంటున్నారు. మనుషుల జాడను శునకాల సాయంతో తెలుసుకుని, ఆయా చోట్ల చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సైనికులు సాయం అందిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీజీ కర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నలిగిపోయిన బోగీలను కట్ చేసి, లోపలున్న వారికి ఏమీ కాకుండా కాపాడడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు.