Odisha: ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్

Coromandel Express derails after collision with goods train in Odishas Balasore
షార్ట్స్‌లో చూడండి
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Go Back to Shorts
Odisha
Train Accident

More Telugu News