సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం
- సిద్ధిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో సిద్ధమవుతున్న ఆలయం
- అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో 3800 అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు
- రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం
- ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ
ఇప్పటికే వినాయకుడు, శివాలయాలు పూర్తయ్యాయి. రోబోలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా ఈ ఆలయం నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని, ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనని కంపెనీ ఎండీ జీడిపల్లి హరికృష్ణ మీడియాకు తెలిపారు.