టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. ఏకంగా కోచింగ్ సెంటర్ కే పేపర్ అమ్మకం
- సిట్ విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు
- కేసులో మొత్తంగా 50 మందిపై శాశ్వతంగా వేటు
- వరంగల్ లో కోచింగ్ సెంటర్ కేంద్రంగా పేపర్ అమ్మకం
పోలీసుల అదుపులో ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ రమేశ్.. పలువురు అభ్యర్థుల నుంచి భారీ మొత్తం వసూలు చేసి ప్రశ్నపత్రం అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పరీక్షలకు సంబంధించి 25 పేపర్లను అమ్మాడని తెలిపారు. ఏఈఈ పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాయంతో రమేష్ జవాబులు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 43 కు చేరుకోగా.. మరో 50 మందిపై శాశ్వతంగా వేటు పడింది. భవిష్యత్తులో వారు ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేశారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.