29 ఏళ్ల గాళ్‌ఫ్రెండ్‌తో బిడ్డను కంటున్న 83 ఏళ్ల హాలీవుడ్ నటుడు!

Al Pacino Is Expecting Child at 89 With 29 Year Old Girlfriend Noor Alfallah
  • 29 ఏళ్ల నూర్ అల్‌ఫాల్లాతో ఏడాదిగా డేటింగ్
  • ఇప్పటికే ఆమెకు ముగ్గురు సంతానం
  • నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికన్ నటుడు
హాలీవుడ్ గ్రేటెస్ట్ నటుడు అల్ పాచినో 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన 29 ఏళ్ల గాళ్‌ఫ్రెండ్ నూర్ అల్‌ఫాల్లా ప్రస్తుతం గర్భవతి అని, మరో నెల రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్నదని సమాచారం. నూర్ గతేడాది ఏప్రిల్ నుంచి పాచినోతో కలిసి ఉంటోంది. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు బేవెర్లీ డి ఏంజిలో (71)తో కాగా, ఒకరిని జాన్ టారెంట్‌తో కన్నది. 

నాలుగోసారి బిడ్డకు జన్మనిస్తున్నట్టు నూర్ నిర్ధారించినట్టు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నూర్ తరచూ డబ్బున్న వృద్ధులతో డేటింగ్ చేస్తూ ఉంటుందని తెలిపాయి. కరోనా సమయంలో పాచినో, నూర్ కలుసుకున్నారని, ఆ తర్వాతి నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నట్టు వివరించాయి.

అంతకుముందు ఆమె మిక్ జాగెర్‌తో కొన్నాళ్లు, ఆ తర్వాత నికోలస్ బెర్గ్యూయెన్‌తో డేట్ చేసినట్టు పేర్కొన్నాయి. అంతేకాదు, నూర్ గతంలో ఒకసారి క్లింట్ ఈస్ట్‌వుడ్ (92)తో కలిసి కనిపించింది. అయితే, తమ మధ్య డేటింగ్ అంటూ ఏమీ లేదని ఆ తర్వాత ఆమె ఖండించింది.
Go Back to Shorts
Al Pacino
Noor Alfallah
Hollywood

More Telugu News