కదులుతున్న కారుపై పుష్ అప్స్.. గురుగ్రాంలో యువకుల నిర్వాకం
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాహనదారులు
- నిందితుడిని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
- కారు యజమానికి రూ.6,500 జరిమానా
మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వైరల్ గా మారిన వీడియోలో వైట్ కలర్ కారుపైన ఓ యువకుడు పుష్ అప్స్ చేస్తుండడం కనిపిస్తోంది. అతడి స్నేహితులు కారు విండోలో నుంచి తలలు బయటపెట్టి చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా కారు వెళుతుండగానే జరిగింది. వారి వెనక వస్తున్న కారులో నుంచి ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయడం, అదికాస్తా వైరల్ గా మారడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కాగా, రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే సహించబోమని గురుగ్రాం ట్రాఫిక్ డీసీపీ విజేందర్ హెచ్చరించారు.