నిలిచిన వాన... ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే టార్గెట్ కుదింపు
- అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
- తొలుత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసిన గుజరాత్
- వర్షంతో నిలిచిన చెన్నై చేజింగ్
- సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 రన్స్
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 0.3 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగులు చేసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిచింది.
వర్షం తగ్గిన అనంతరం చెన్నై జట్టు లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. ఒక్కో బౌలర్ గరిష్ఠంగా 3 ఓవర్లు విసరొచ్చు. పవర్ ప్లే 4 ఓవర్ల పాటు కొనసాగుతుంది.