కెనడాలో భారత సంతతి గ్యాంగ్ స్టర్ కాల్చివేత
- వివాహ వేడుకలో పాల్గొన్న గ్యాంగ్ స్టర్ పై దుండగుడి కాల్పులు
- అతిథులు డ్యాన్స్ చేస్తుండగా లోపలికి వచ్చిన ఆగంతుకుడు
- సీపీఆర్ చేసి గ్యాంగ్ స్టర్ ను కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వివాహ వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాటు చేయగా కొంతమంది అతిథులు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఓ ఆగంతుకుడు లోపలికి వచ్చి డీజే ఆపాల్సిందిగా కోరాడు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే అమర్ ప్రీత్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అమర్ ప్రీత్ కు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని, తీవ్ర గాయాలతో అమర్ ప్రీత్ చనిపోయాడని చెప్పారు. కాగా, ఈ హత్యకు కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.