ఆ సినిమాలో సమంతకి బదులుగా శ్రీలీలను తీసుకున్నారట!
- ఇంగ్లిష్ చిత్రంగా రూపొందుతున్న 'ది చెన్నై స్టోరీ'
- ఇంతకుముందు తెరపైకి వచ్చిన సమంత పేరు
- తాజాగా శ్రీలీలను తీసుకున్నారనే సమాచారం
- వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శ్రీలీల
'ది చెన్నై స్టోరీ' అనే ఒక ఇంగ్లిష్ సినిమాను వివేక్ కల్రా హీరోగా రూపొందిస్తున్నారు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముందుగా సమంత పేరు వినిపించింది. ఆమెను కథానాయికగా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆమెకి బదులుగా ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తోంది.
ఇంగ్లాండ్ యువకుడికి .. చెన్నై కి చెందిన యువతికి మధ్య నడిచే ప్రేమ .. ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి శ్రీలీల ఖాతాలో మరో పెద్ద ప్రాజెక్టు చేరిపోయింది. ప్రస్తుతం బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా షూటింగులో శ్రీలీల బిజీగా ఉంది.