స్పీడ్ గానే వచ్చేస్తున్న స్టూడెంట్!
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'నేను స్టూడెంట్ సర్'
- జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు
- కథానాయికగా అవంతిక పరిచయం
- కీలకమైన పాత్రను పోషించిన సముద్రఖని
ఈ సినిమాలో హీరో ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అతను కొనుక్కున్న ఖరీదైన ఫోన్ కనిపించకుండా పోతుంది. ఆ ఫోన్ ను పోలీసులే కాజేశారంటూ అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. ఇంతవరకూ అర్థమయ్యేలా ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోతూ వెళ్లింది.
కథానాయికగా ఈ సినిమాతో అవంతిక దాసాని పరిచయమవుతోంది. తను బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు. ఇక కీలకమైన పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. ఒక ప్రత్యేకమైన పాత్రను సునీల్ పోషించాడు. 'స్వాతిముత్యం' సినిమాలో అమాయకుడిగా మెప్పించిన బెల్లంకొండ గణేశ్, స్టూడెంట్ పాత్రలో ఎలా మెప్పిస్తాడనేది చూడాలి.