పాస్ పోర్ట్ దరఖాస్తు విషయంలో రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట
- ఎంపీగా అనర్హత వేటు పడటంతో దౌత్య పాస్ పోర్ట్ సరెండర్ చేసిన రాహుల్
- సాధారణ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
- ఆయనకు ఎన్ఓసీ మంజూరు చేయవద్దంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా వాదనలు విన్న సమయంలో స్వామి సదరు దరఖాస్తును వ్యతిరేకించారు. రాహుల్ కు పాస్‌పోర్ట్‌ను ఒక సంవత్సరం పాటు మాత్రమే జారీ చేయాలని, ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలని అన్నారు. ఇది ప్రత్యేకమైన కేసు అనీ, పదేళ్ల కాలానికి పాస్ పోర్ట్ జారీ చేయకూడదని అన్నారు. అలా చేయడం తప్పుగా అవుతుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడేళ్ల కాలానికి మాత్రమే ఎన్వోసీని మంజూరు చేశారు.