కాంగ్రెస్ పై వ్యతిరేకతతో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో మార్పు వచ్చింది.. సంతోషంగా ఉంది: వీహెచ్
- మొన్నటి వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో కోమటిరెడ్డి ఉన్నారన్న వీహెచ్
- హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల తర్వాత మనసు మారిందని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలంతా కలసికట్టుగా పని చేయాలని విన్నపం
ప్రజల్లో ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంటుందని... అయితే కాంగ్రెస్ నాయకులంతా కలసికట్టుగా పని చేస్తేనే అధికారం వస్తుందని వీహెచ్ అన్నారు. మనలోమనకు ఉన్న మనస్పర్థలను తగ్గించుకుని కలసి పని చేస్తే బాగుంటుందని చెప్పారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలను అందరూ మర్చిపోవాలని సూచించారు. ప్రజలు, కార్యకర్తల బాధలను తెలుసుకుని, వారి కోసం పని చేయాలని చెప్పారు.