కారునైతే చోరీ చేశారు కానీ.. డ్రైవింగ్ రాక 10 కిలోమీటర్లు తోసుకెళ్లారు!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- నిందితుల్లో ఇద్దరు బీటెక్ విద్యార్థులు
- ఈజీ మనీ కోసం చోరీల బాట
ఈ క్రమంలో బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22న రాత్రి ఓ మారుతి కారును దొంగిలించారు. కారునైతే దొంగిలించారు కానీ వారిలో ఒక్కరికి కూడా కారు డ్రైవింగ్ చేతకాదు. దీంతో కారును తోసుకుంటూ 10 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడ ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారు నంబరు ప్లేటును తీసేసి పార్కింగ్ చేసి వెళ్లిపోయారు. కారు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారుతోపాటు మరో రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.