ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ

Atchannaidu wrote DGP Rajendranath Reddy
  • ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
  • రాజమండ్రిలో టీడీపీ ప్లీనరీ
  • బందోబస్తు కల్పించాలంటూ డీజీపీని కోరిన అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడుకు బందోబస్తు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మహానాడుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని డీజీపీని కోరారు. 

కాగా, మహానాడు సక్సెస్ కాకుండా చేసేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు రాకుండా అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని, మహానాడుకు వచ్చే బస్సులను సీజ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Atchannaidu
AP DGP
Letter
TDP Mahanadu
Rajahmundry
Telugudesam
Andhra Pradesh

More Telugu News