Rana: తేజ దర్శకత్వంలో మరోసారి హీరోగా రానా!

  • 'అహింస' రిలీజ్ పనుల్లో తేజ 
  • మరోసారి రానాతో కలిసి రంగంలోకి 
  • గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'నేనేరాజు నేనేమంత్రి'
  • కొత్త ప్రాజెక్టు నిర్మాతగా ఆచంట గోపీనాథ్
Rana in Teja Cinema

తేజ తయారు చేసుకునే కథలు .. ఆయన పాత్రలను తీర్చిదిద్దే విధానం విలక్షణంగా ఉంటాయి. రానా తమ్ముడు అభిరామ్ ను 'అహింస' సినిమాతో ఆయన హీరోగా పరిచయం చేస్తున్నాడు. జూన్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ తనకి బాగా అచ్చొచ్చిన ప్రేమకథలు జోనర్లోనే ఈ సినిమాను రూపొందించాడు. 

ఈ సినిమా తరువాత తేజ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండనుందనే ప్రశ్నకి సమాధానంగా రానా పేరు వినిపిస్తోంది. అవును.. రానా కథానాయకుడిగా తేజ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. 

గతంలో తేజ - రానా కాంబినేషన్లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా వచ్చింది. 2017లో వచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. రానా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతోంది. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న రానా, ఇకపై దూకుడు చూపిస్తాడేమో చూడాలి.

More Telugu News