USA: శ్వేతసౌధంపై దాడి చేయబోయిన తెలుగు యువకుడి అరెస్ట్

Truck crashes into white house driver indentified as indian origin saivarshith
  • భారీ ట్రక్‌తో శ్వేతసౌధం పరిసరాల్లోకి దూసుకొచ్చిన సాయివర్షిత్(19)
  • ట్రాఫిక్ బారియర్స్‌‌ను ఢీకొట్టి ధ్వంసం, మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నం
  • అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడి
  • యువకుడి ట్రక్‌పై నాజీ జెండా గుర్తింపు
  • 2022లో పాఠశాల చదువు పూర్తిచేసుకున్న సాయివర్షిత్
అమెరికా అధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నంచాడన్న నేరంపై పోలీసులు సోమవారం ఓ తెలుగు యవకుడిని అరెస్ట్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో సాయివర్షిత్ కందుల(19) శ్వేతసౌధం ఉత్తర భాగంవైపు ఓ భారీ ట్రక్కుతో దూసుకువచ్చాడు. అక్కడ భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టి మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్‌కు నాజీ జెండా తగిలించి ఉండటాన్ని కూడా పోలీసులు గమనించారు. 

యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించాడు. దీంతో, పోలీసులు నిందితుడిపై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తదితర అభియోగాలు నమోదు చేశారు. అధికారులు ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 

ఛెస్ట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయివర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. సాయివర్షిత్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అతడి గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
USA

More Telugu News