జగన్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ కానిస్టేబుల్

  • రిప్రజెంటేషన్ తీసుకుని జగన్ ను కలిసేందుకు యత్నించిన కానిస్టేబుల్
  • తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనే ఘటన
  • కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న భద్రతా సిబ్బంది
తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ కి ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడు. రిప్రజెంటేషన్ తీసుకుని జగన్ ను కలిసేందుకు అతడు ప్రయత్నించాడు. గుంటూరు నుంచి జగన్ తిరిగి వస్తున్న సమయంలో.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. 

దీంతో వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వినతి పత్రం ఇచ్చేందుకు తాను ప్రయత్నించినట్లు కానిస్టేబుల్ చెప్పినట్లు సమాచారం.

Jagan
convoy
Constable
Constable obstructed Jagans convoy

More Telugu News