శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరు?
- కాసేపట్లో చెన్నైలో శరత్ బాబుకు అంత్యక్రియలు
- రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ శరత్ బాబుకు లేని వారసులు
- తోబుట్టువుల పిల్లల్లో ఒకరు తలకొరివి పెట్టనున్నట్టు సమాచారం
శరత్ బాబు తన సినీ కెరీర్ ప్రారంభంలోనే అప్పటికే నటిగా రాణిస్తున్న రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్లు కాపురం చేసిన తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు తమిళ నటుడు నంబియార్ కూతుతు స్నేహను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా మనస్పర్థలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరు భార్యలతో శరత్ బాబుకు ఒక్క సంతానం కూడా కలగలేదు.
మరోవైపు శరత్ బాబుకు ఏడుగురు అన్నాదమ్ముళ్లు, ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరందరికీ కలిపి 25 మంది వరకు సంతానం ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు శరత్ బాబుకు అంత్యక్రియలను నిర్వహిస్తారని తెలుస్తోంది.