రూ.2 వేల నోటు ఎఫెక్ట్.. గోల్డ్ షాపుల్లో రద్దీ
- కరెన్సీని బంగారం రూపంలోకి మార్చుకునే ప్రయత్నం
- రూ.2 లక్షల లోపు కొనుగోళ్లకు డాక్యుమెంట్లు చూపనక్కర్లేదు
- పెద్ద నోట్లతో కొంటే అదనంగా వసూలు చేస్తున్న వ్యాపారులు
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. రూ.2 లక్షల లోపు బంగారం, వెండి, రత్నాలు తదితర ఆభరణాలను నగదుతో కొనుగోలు చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరంలేదు. అంతకుమించిన నగదు కొనుగోళ్లకు మాత్రం పాన్, ఆధార్ కార్డుల వివరాలు తప్పనిసరి. ఈ రూల్ ను అనుకూలంగా మార్చుకుని తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని బంగారం దుకాణాల యజమానులు కూడా అర్థం చేసుకున్నారు. దీంతో బంగారం రేటు పెంచేశారు. పెద్ద నోటుతో కొంటే 5 నుంచి 10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బంగారం రేటు 10 గ్రాములకు రూ.61 వేలకు పైనే కొనసాగుతుండగా.. రూ.2 వేల నోట్లతో బంగారం కొనాలనుకుంటే రూ.67 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం.