తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ

  • వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్
  • ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు
  • తల్లి ఆసుపత్రిలో ఉందన్న అవినాశ్ రెడ్డి
  • రేపటి విచారణకు రాలేనని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 16, 19 తేదీల్లో జరగాల్సిన విచారణకు అవినాశ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో, ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. 

తాజాగా, అవినాశ్ రెడ్డి ఈ నోటీసులకు బదులిచ్చారు. తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని సీబీఐకి నేడు లేఖ రాశారు. రేపటి విచారణకు తాను హాజరు కాలేనని స్పష్టం చేశారు.


More Telugu News

YS Avinash Reddy CBI YS Vivekananda Reddy YSRCP Andhra Pradesh