నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు
- బెంగాల్‌లో మమత ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి హర్షం
- తనను రాష్ట్రం నుంచి బహిష్కరించారని ఆరోపణ
- ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాని ప్రజలకు రహస్యంగా చూపించినట్లు వెల్లడి
- ఇక భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తన కశ్మీర్ ఫైల్స్ సినిమాను రాష్ట్రంలో ఆడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పైగా తనని పూర్తిగా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా బహిష్కరించారని తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని ‘తృణమూల్ కాంగ్రెస్’ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. స్వయంగా దీదీ సైతం భవానీపూర్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈ తరుణంలో అగ్నిహోత్రి వీడియో రూపంలో విడుదల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాన్నీ మమతా బెనర్జీ రాష్ట్రంలో నిషేధించారని అగ్నిహోత్రి ఆరోపించారు. చివరకు ట్రైలర్ లాంచ్‌ను సైతం అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. తమపై దాడులు జరిగాయని, అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయినా వెనకడుగు వేయకుండా ఎన్నికల సమయంలో ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాను రహస్యంగా అనేక మందికి చూపించినట్లు వెల్లడించారు. తన పోరాటానికి తగిన ఫలితం దక్కిందని.. ఎట్టకేలకు ఎన్నికల్లో గొప్ప విజయం సాధించామని వ్యాఖ్యానించారు. ఇక నుంచి బెంగాల్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ ఫలితాల అనంతరం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.